![]() |
![]() |
.webp)
మంగ్లీ గురించి చెప్పాలంటే ఆమె ఒక అద్భుతమైన సింగర్ గా అందరికీ సుపరిచితురాలే..అటు మూవీస్ లో ఆమె పాటలు పాడుతూ ఉంటుంది. ఇటు షోస్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాంటి మంగ్లీ శివుడికి పరమ భక్తురాలు. తాను పాడే పాటల్లో శివుడి మీద పాటలే ఎక్కువగా ఉంటాయి. అలాంటి మంగ్లీ తన పుట్టినరోజు వేడుకలను ఆ శివుడి సాన్నిధ్యంలో సెలెబ్రేట్ చేసుకుంది. "ఈ రోజు నా పుట్టినరోజును హిమాచల్ ప్రదేశ్‌లోని మణికరణ్‌లో జరుపుకున్నాను.. శ్రీ మణికరణ్ సాహిబ్ గురుద్వారా యొక్క పవిత్ర క్షేత్రాన్ని సందర్శించాను.ఇక్కడ ఉడుకు నీటి ద్వారా వండే అన్నప్రసాదం సేవలో పాల్గొన్నాను.
నాపై ప్రేమ చూపించి , ఆశీర్వాదాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మీ శుభాకాంక్షలకు మరోసారి ధన్యవాదాలు" అని పోస్ట్ చేసి తాను అక్కడ భక్తులకు అన్న ప్రసాదాన్ని పెడుతున్న వీడియోస్ ని పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే బంజారా టాప్ 1 సింగర్ మంగ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మెసేజెస్ పెడుతున్నారు. ఇంతమంది విషెస్ చెప్పినందుకు మంగ్లీ కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక మెసేజ్ ని పోస్ట్ చేసింది. తనకి శుభాకాంక్షలు చెప్పిన ఎవరినీ మరిచిపోనని కూడా చెప్పింది.
![]() |
![]() |